జనాగ్రహ సభను విజయవంతం చేయండి: ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి

శేరిలింగంప‌ల్లి, మే 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఈ నెల 10న పరేడ్ గ్రౌండ్ లో జరగబోయే జనాగ్రహ సభకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజ‌ర‌వుతున్న‌ సందర్బంగా మసీద్ బండలోని శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాసరావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ అలె భాస్కర్, రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ కంటెస్టడ్ ఎమ్మెల్యే మారబోయిన రవికుమార్ యాదవ్ సమక్షంలో సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్ లో మహిళా బిల్లు, నియోజకవర్గ పునర్విభజన బిల్లు ను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుని మహిళ ద్రోహిగా చరిత్రలో నిలిచి పోయింద‌న్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పార్లమెంట్ కు రాకుండా అడ్డుకుని sc, st ల‌కు చట్ట సభలలో ప్రాతినిధ్యం లేకుండా చేశారని అన్నారు. ఈ సమావేశంలో అశోక్ కురుమ, బుచ్చిరెడ్డి, వసంత్ యాదవ్, అనిల్ గౌడ్ , రాధాకృష్ణ యాదవ్ , దుర్గాప్రసాద్, కృష్ణంరాజు, పద్మ , సింధు , రెడ్డి ప్రభ, వంశీ రెడ్డి , జితేందర్, లక్ష్మణ్, శ్రీనివాసరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here