శేరిలింగంపల్లి, అక్టోబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ విద్యా నగర్ కాలనీలో శేరిలింగంపల్లి బీఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి సమావేశం నిర్వహించారు. నవంబర్ 2 వ తేదీన ఆమె బీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అందరూ సంఘీభావం తెలిపారు. బొబ్బ నవత రెడ్డి చేరికతో పార్టీ బలోపేతం అవుతుందని , రాబోయే కాలం లో శేరిలింగంపల్లి లో బీఆర్ ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం అని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నవంబర్ 2 వ తేదీన ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ భవన్ లో కే టీఆర్ ఆధ్వర్యంలో చేరిక కార్యక్రమం ఉంటుందని, కనుక బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ సామ వెంకట్ రెడ్డి, కోమండ్ల శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్ శర్మ, పురుషోత్తం యాదవ్, పారునంది శ్రీకాంత్, మల్లా రెడ్డి, సంగారెడ్డి, శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, ప్రకాష్, రాజన్న, రమేష్, రామకృష్ణ గౌడ్, అల్లావుద్దీన్, శ్రీనివాస్ గౌడ్, భిక్షపతి, సలీం, గౌస్, చందర్ రావు, అనంత రెడ్డి, సంతోష్, ప్రమోద్, గిరి, అఫ్సర్, చిన్న, రామకృష్ణ పాల్గొన్నారు.






