- పెర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్ ద్వారా హై రిస్క్ హార్ట్ ఫెయిల్యూర్‌కి వైద్యం
- నాన్–సర్జికల్ టెక్నాలజీని ఉపయోగించి రోగిని కాపాడిన డాక్టర్ శరత్‌రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: యూఏఈలో పనిచేస్తున్న ఓ 49 సంవత్సరాల వ్యక్తికి 2002లో కిడ్నీ మార్పిడి జరిగింది. అయితే 2018లో కిడ్నీ మార్పిడి ఫెయిల్ అయినట్లు నిర్ధారణ జరిగింది. దాంతో పాటు హార్ట్ పంపింగ్ కూడా ఫెయిల్ అయినట్లు కరోనరీ ఆంజియోగ్రామ్ ద్వారా తెలిసింది. రెండు నాళాల్లో పూర్తి బ్లాకేజీలతో ట్రిపుల్ వెజిల్ డిసీజ్ నిర్ధారణ అయింది. యూఏఈలో హార్ట్ ఫెయిల్యూర్ స్టెబిలైజేషన్ గురించి ఎన్నోసార్లు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అయినా ఆయన కండీషన్ కఠినంగా ఉండటంవల్ల ఇంటర్వెన్షన్ చేయలేకపోయారు. అలాగే ఈ సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్ కారణంగా రెండోసారి కిడ్నీ మార్పిడికి కూడా ప్లాన్ చేసుకోలేకపోయాడు. ఇతరుల ద్వార సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఇటీవల ఆయనను మెడికవర్ హాస్పిటల్‌లో కార్డియాక్ కన్సల్టేషన్ కోసం డాక్టర్ శరత్ రెడ్డిని సంప్రదించారు. ఆయనతో పాటు నెఫ్రాలజిస్ట్ కమల్ కిరణ్‌లు రోగి క్లినికల్ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. ఆపైన పెర్క్యూటేనియస్ ఎల్వీ అసిస్ట్ డివైజ్ ‘ఇంపెల్లా’ సాయంతో ఆ పేషెంట్ హార్ట్ బ్లడ్ వెజిల్ బ్యాకేజీలను పెర్క్యూటేనిషస్ ఇంటర్వెన్షన్ పద్ధతి ద్వారా తొలగించారు. ఐదు గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్ పూర్తి విజయవంతమయ్యి రోగి ప్రాణపాయం నుంచి బయటపడ్డారు. కేవలం ఒకటిన్నర రోజు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి అవసరమైన మెడికేషన్ ఇచ్చి డిస్చార్జి చేశారు.

మేడికవర్ హాస్పిటల్ డైరెక్టర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇంపెల్లా అనేది యూఎస్ ఎఫ్డీఏ ధృవీకరించిన నాన్–సర్జికల్ హార్ట్ పంప్ టెక్నాలజీ. ఇది ముఖ్యంగా తీవ్రమైన గుండె సమస్యలతో పాటు ఇతర ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు ఉన్నకేసుల్లో అవసరం పడుతుంది. ఇది చాలా సురక్షితం. అలాగే క్లిష్ట పరిస్థితుల్లో సమర్థమైన హార్ట్ పంప్స్ని అందిస్తుంది. ఇంపెల్లాను ఉపయోగించి పీసీఐ ప్రొసీజర్ చేయడంవల్ల గుండెతో సహా అన్ని అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలగే రకరకాల చికిత్సలు చేయాల్సిన అవసరం ఉండదు. పైగా హాస్పిటల్లో ఎక్కువరోజులు ఉండాల్సిన పని లేద’’ని అన్నారు.






