చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం – ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: వేసవి కాలంలో మండుతున్న ఎండలకు పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని రాజా రామ్ కాలనీలో ప్రధాన రహదారి పై టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రఘునాథ్ రావు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నగరంలో రోజు రోజుకూ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రజలు, పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. చలి వేంద్రాల ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం అని వేసవికాలంలో ప్రజల దాహాన్ని తీర్చడం గొప్ప విషయం అన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేసిన నిర్వాహకులు రఘునాథ్ రావుని ఎమ్మెల్యే గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,మియాపూర్ డివిజన్ ఆధ్యక్షుడు కిరణ్ యాదవ్, నాయకులు నల్లా సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, కృష్ణ ముదిరాజ్, వార్డు సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, విమల్ కుమార్, సుదర్శన్, బాలింగ్ వెంకటేష్ గౌడ్, లక్ష్మణ్ గుప్తా, ముఖేష్, చిన్న, సీతారాం,స్వామి నాయక్, శ్రీనివాస్ కాకా, శోభన్, జ్ఞానేశ్వర్, గోపాల్, కేశవ్, శివ, ధనరాజ్, ముజీబ్, పాషా, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రఘునాథ్ రావు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here