ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి – నివాళి అర్పించిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి: భారత మాజీ ఉప ప్రధానమంత్రి డా. బాబూ జగ్జీవన్ రామ్ గొప్ప దార్శనికుడని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలను మాదాపూర్ డివిజన్ పరిధిలోని రాజా రామ్ కాలనీలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రఘునాథ్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశానికి బాబూ జగ్జీవన్ రామ్ చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఆత్మ విశ్వాసమే ఆయుధం గా దళితుల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల కోసం నిత్యం పాటుపడిన మహానుభావుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు. నిమ్న వర్గాల నుండి ఉన్నత స్థానాలను అధిరోహించిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ పరిపాలన దక్షత అనుభవాలు, సామాజిక న్యాయం కోసం ఆయన కృషిని గుర్తు చేసుకుంటూ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ ఆధ్యక్షుడు బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, నాయకులు నల్లా సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, కృష్ణ ముదిరాజ్, వార్డు సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, విమల్ కుమార్, సుదర్శన్, బాలింగ్ వెంకటేష్ గౌడ్, లక్ష్మణ్ గుప్త, ముఖేష్, చిన్న, సీతారాం, స్వామి నాయక్, శ్రీనివాస్ కాకా, శోభన్, జ్ఞానేశ్వర్, గోపాల్, కేశవ్, శివ, ధనరాజ్, ముజీబ్, పాషా తదితరులు పాల్గొన్నారు.

బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here