నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీ లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, జీహెచ్ఎంసీ ఆయా శాఖల అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ డ్రైనేజీ, రోడ్లు, తదితర సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. కాలనీలో పారిశుధ్య నిర్వహణ పై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్య నిర్వహణ సరిగా నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, జలమండలి మేనేజర్ నరేందర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మెహ్రా, టీపీఎస్ రవీందర్, ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్స్ ఏఈ రాజేష్, నాయకులు జంగయ్య యాదవ్, రమేష్, గోవింద్, నారాయణ, ఇందిరా నగర్ వాసులు సుబ్రమణ్యం, అమర్నాథ్ రెడ్డి, కర్ణాకర్, మల్లికార్జున రెడ్డి, రాధాకృష్ణ, నర్సింగరావు, రాజారెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.