
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో కార్తీక మాస శివరాత్రి మహా పుణ్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానంగా శ్రీ భవాని శంకర స్వామి వారికి సహస్ర దీపాలంకార సేవ, ఉంజల సేవా జరిపించారు. ఆలయ ప్రధానార్చకులు, పీఠం తెలంగాణ ఆగమసలహాదారు శ్రీ సుదర్శనం సత్యసాయి పర్యవ్యేక్షణలో జరిగిన ఈ సేవల్లో ఆలయ పాలకమండలి సభ్యులతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా దీపాలు వెలిగించారు. అనంతరం ఉంజల్ సేవలో స్వామి వారిని దర్శించుకుని తరించారు.
