నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ మాక్ అసెంబ్లీలో కూకట్పల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాజు శెట్టి కురుమ వ్యవహరించారు. భవిష్యత్తు తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా శుక్రవారం జరిగిన తెలంగాణ మాక్ అసెంబ్లీకి కూకట్పల్లి నియోజకవర్గం నుండి రాజు శెట్టి కురుమ ఎంపికయ్యారు. తెలంగాణ యువ నాయకులు ఒకరోజు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధి, నియోజకవర్గంలోని సమస్యలపై మాక్ అసెంబ్లీలో చర్చించారు. ఈ మాక్ అసెంబ్లీకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈటల రాజేందర్ వ్యవహరించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుండి వివిధ క్షేత్రాలలో సమాజం పట్ల బాధ్యత సేవా దృక్పథంతో ఉన్న యువతను ఎంపిక చేయడం జరిగిందని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించగా ఈ కార్యక్రమంలో రాజు శెట్టి కురుమ కు అవకాశం రావడంతో రాష్ట్రం లోని విద్య వ్యవస్థ సంస్కరణల పై, చేయవలసిన మార్పుల పై సభాపతి కి వివరణ ఇచ్చినట్లు రాజుశెట్టి తెలిపారు.