లింగంపల్లి బోనాల మహోత్సవంలో రాగం దంపతులు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా టీఆర్ఎస్ ప్రభుత్వం బోనాల మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. లింగంపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా జరిగిన బోనాల మహోత్సవంలో శేరిలింగంపల్లి డివిజన్ గౌరవ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో పాడి పంటలతో రైతులు, అన్ని వర్గాల ప్రజలు అమ్మవారి కృపాకటాక్షాలతో సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరిసంపదలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు, రాణ ఇన్ఫ్రా కన్‌స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ రాగం అనిరుద్ యాదవ్, నాయకులు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, గడ్డం రవి యాదవ్, లింగం శ్రీనివాస్, కిషోర్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, పి.రాజు యాదవ్, శ్రీనివాస్, కే.శ్రీనివాస్, గఫర్, సాయి ముదిరాజ్, కిషోర్, శశికిరణ్, రఘు, మధు, మనోహర్, సాయి యాదవ్, ప్రశాంత్ యాదవ్, పులి, లడ్డు, మజ్జు, యాదగిరి భక్తులు తదితరులు పాల్గొన్నారు.

లింగంపల్లి లో నిర్వహించిన బోనాల మహోత్సవంలో పాల్గొన్న రాగం నాగేందర్ యాదవ్ దంపతులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here