నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్ ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ ఆల్విన్ కాలనీలో నివసిస్తున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తన ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు పెంట్ హౌస్ లోని తన రూమ్ లోకి వెళ్లిన జ్ఞానేంద్ర ప్రసాద్ కాసేపు డిస్టర్బ్ చేయొద్దు పడుకుంటానని పీఏ సురేష్ తో చెప్పి లోపలి నుండి గడియ పెట్టుకొని చీరతో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. టిఫిన్ ఇవ్వడం కోసం వెళ్లగా డోర్ తీయకపోవడంతో కిటికీ లోంచి చూసిన అతని పీఏ సురేష్, పక్క వారి సహాయంతో డోర్ బ్రేక్ చేసి జ్ఞానేంద్ర ప్రసాద్ ను ఉరి నుండి కింది దింపి శ్రీకర హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్లు పరీక్షించి చూసి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. భార్య సౌమ్య శ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు. గత కొద్దికాలం క్రితం జ్ఞానేంద్రప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురై ఇటీవలే కోలుకున్నాడు.