నమస్తే శేరిలింగంపల్లి: ఎంతోమంది వీరుల ఫోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సాధించుకుని 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన 75వ భారత స్వతంత్ర వజ్రత్సోవాల్లో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రైవేటు జునియర్ కళాశాలలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని సుచించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల త్యాగాలు గుర్తు చేసుకోవాలని, బానిసత్వం నుంచి విముక్తి కల్పించిన స్వాతంత్ర్య సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ఫణి, నగేష్, టీఆర్ఎస్ నాయకులు వరలక్ష్మి రెడ్డి, హరీష్ రెడ్డి అమిత్ దుబే తదితరులు పాల్గొన్నారు.