క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం – రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఒలంపియస్ బ్యాట్మింటన్ అకాడమీ మన్సూరాబాద్ ఆధ్వర్యంలో 8వ తెలంగాణ స్టేట్ మెన్ అండ్ ఉమెన్స్, మాస్టర్స్ ఛాంపియన్ షిప్ పోటీలు ఎల్ బీ నగర్ లో నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ శ్రీనివాస్ గుప్త బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాల ప్రోత్సహిస్తూ క్రీడల పట్ల ఆసక్తి కనబరిచేలా చేస్తోందని అన్నారు. 40 ప్లస్ మెన్ డబుల్ లో రన్నర్ టి. శ్రీనివాస్ యాదవ్, ఎస్ వీ ఎల్ ప్రసాద్, 40 ప్లస్ సింగిల్ రన్నర్ గా నిలిచిన వీరాస్వామికి శ్రీనివాస్ గుప్తా బహుమతులను అందజేశారు.

రన్నర్ గా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేస్తున్న రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here