వ్య‌వ‌సాయ చ‌ట్టాల ప్రతులను దహనం చేసిన వామపక్ష నాయకులు

మియాపూర్‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దేశ వ్యాప్తంగా నిర్వ‌హించాల‌ని ఇచ్చిన‌ చక్కా బంద్ పిలుపులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మియాపూర్ డివిజన్ ముజఫర్ అహ్మద్ నగర్ లో ఎంసిపిఐ (యు) కార్యాలయం ఎదుట‌ సిపిఎం, ఎంసిపిఐ (యు) నాయకుల‌ ఆధ్వర్యంలో వ్య‌వ‌సాయ‌ చట్టాల ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నాయకులు తుకారం నాయక్, కొంగరి కృష్ణ ముదిరాజ్ లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక రోజులుగా పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ కంపెనీల మాయాజాలంలో పడి రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్య‌వ‌సాయ చ‌ట్టాల ప్రతులను దహనం చేస్తున్న వామపక్ష నాయకులు

సాగు చట్టాలు రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని చెప్పినప్పటికీ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను అవమానిస్తుంద‌ని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాల ద్వారా పూర్తిగా చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ రంగం నుండి పారి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టాలను వాయిదా వేసే బదులు వాటిని రద్దు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లుల‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. కనీసం మద్దతుధర లేకుండా వ్యవసాయ చట్టాలు తీసుకురావడం ద్వారా అవి పూర్తిగా రైతు వ్యతిరేక చట్టాలుగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు అనిల్ కుమార్, కన్నా శ్రీనివాస్, రవి, మురళి, యువజన సంఘం నాయకులు మధు, రాజు, పుష్ప పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here