చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్‌లోని సురక్షా ఎన్ క్లేవ్లో నివాసం ఉండే దిగజర్ల రాములు కుమారుడు క్రాంతి (34) శనివారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. అనంతరం తిరిగి రాలేదు. దీంతో అతని తండ్రి రాములు, ఇతర కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేదు. ఈ క్రమంలో రాములు తన కుమారుడు అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా క్రాంతి గత కొంత కాలం కిందటి నుంచి మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నాడని అతని తండ్రి పోలీసులకు తెలిపాడని పోలీసులు వివరించారు.