శేరిలింగంపల్లి, జనవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ పటిష్టత కోసం, రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా, సంస్థాగతంగా పార్టీ తీసుకున్న నిర్ణయాలలో భాగంగా నియోజకవర్గంలో డివిజన్ల వారిగా నూతన నాయకులకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పాటిష్టత దృష్టిలో పెట్టుకొని పార్టీ కొత్తగా అధ్యక్షులను నియమించింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆల్విన్ కాలనీ, పాపిరెడ్డి నగర్, మియాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి, వివేకానంద నగర్, హఫీజ్పేట్ , చందానగర్ డివిజన్లకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్ రావు, నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, పార్టీ సీనియర్ నాయకుల సహకారంతో నూతన నాయకులను డివిజన్ అధ్యక్షులుగా నియమించారు.
అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పార్టీకి విధేయుడుగా ఉంటూ డివిజన్ సమస్యలపై దృష్టి సాధించి పేద ప్రజలకు సేవ చేయాలని, సంస్థాగతంగా పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లాలని రవి కుమార్ యాదవ్ సూచించారు. మియాపూర్ డివిజన్ ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ , హఫీజ్పేట్ జితేందర్, ఆల్విన్ కాలనీ ఎత్తరి రమేష్, వివేకానంద నగర్ డివిజన్ డాక్టర్ వంశీ రెడ్డి, పాపి రెడ్డి నగర్ బాలు యాదవ్, లింగంపల్లి కిషోర్ ముదిరాజ్, గచ్చిబౌలి శివ సింగ్, చందానగర్ శ్రీనివాస్ రెడ్డి నియమింపబడ్డారు. నూతనంగా ఎన్నుకోబడిన డివిజన్ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ని కలిసి డివిజన్ అధ్యక్షులుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.