శేరిలింగంపల్లి, జనవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్, దర్గా లోని సాయి నగర్ కాలనీల లో రూ.50.00 లక్షల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్లు హమీద్ పటేల్ , గంగాధర్ రెడ్డి లతో కలిసి PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు,మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గచ్చిబౌలి డివిజన్‌లో..
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ లో రూ.43.00 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిలుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధి లోని రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు , మహిళ నాయకులు , మహిళ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, జిహెచ్ఎంసి అధికారులు, అభిమానులు, కాలనీ వాసులు స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మియాపూర్ డివిజన్‌లో..
మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్, HMT స్వర్ణపూరి కాలనీ ,కృషి నగర్ కాలనీ లో రూ.112.00 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చందానగర్‌లో..
చందానగర్ డివిజన్ పరిధిలోని శంకర్ నగర్, సురక్ష ఎనక్లేవ్, శుభోదయ కాలనీ, వేముకుంట కాలనీల లో రూ.95.00 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు,మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.