శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నికైన పత్రాన్ని కైతాపురం జితేందర్ స్వీకరించారు. హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన కైతాపురం జితేందర్ మాట్లాడుతూ హఫీజ్పేట్ డివిజన్ బిజెపి అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెపి అధ్యక్షుడు సామ రంగారెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్,, శేరిలింగంపల్లి అసెంబ్లీ సీనియర్ నాయకులకు, బీజేపీ అధిష్ఠానం తనపై నమ్మకం ఉంచి హఫీజ్ పేట్ డివిజన్ బిజెపి అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ లో బీజేపి పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని, డివిజన్ లోని సమస్యలపై పోరాటం చేస్తూ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి హఫీజ్ పేట్ డివిజన్ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.