శేరిలింగంపల్లి, ఏప్రిల్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి ప్రముఖ బిసి నాయకుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే కొమరగౌని శంకర్ గౌడ్ దశ దిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, బిసి ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు కొమర గౌని శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఖాజాగూడలోని శంకర్ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులందరూ పాల్గొని శంకర్ గౌడ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో శంకర్ గౌడ్ కుమారులు వెంకటేష్ గౌడ్, సురేష్ గౌడ్, గణేష్, శ్రీనివాస్ గౌడ్‌లతోపాటు ముఖ్య నాయకులు పెద్ద శ్రీశైలం యాదవ్, మహేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్ , రాములు నాయక్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీశైలం, సుధాకర్, నవీన్, ఈశ్వర్ గౌడ్, ఆర్కే సాయన్న, అందెల కుమార్ యాదవ్, మల్కయ్య, రాంబాబు నాయక్, శ్రీను నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ కొమరగౌని శంకర్ గౌడ్ అకాల మరణం బాధాకరమని అన్నారు. చిన్నా పెద్దా పేద ధనిక తేడా లేకుండా ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించే వారని అన్నారు. శంకర్ గౌడ్ గొప్ప అమరవీరుడని, కుస్తీ పోటీల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారని కొనియాడారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడమే కాకుండా ఎంతో మంది పేదలకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.