శేరిలింగంపల్లి, ఏప్రిల్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ పార్టీ కార్యాలయం మాధవరం నగర్ కాలనీలో ఈనెల 27న వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోజా దేవి మాట్లాడుతూ 25 ఏళ్ల బిఆర్ఎస్ పార్టీ గొప్పతనాన్ని, 10 ఏళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ప్రజలందరికీ తెలియజేయాలని, ఉద్యమకారులు, నాయకులు, కార్యకర్తలు, బిఆర్ఎస్ పార్టీని అభిమానించే ప్రతి ఒకరు ముందుకు రావాలని , సభకు భారీగా తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా చలో వరంగల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర రావు, మాచర్ల భద్రయ్య, గిరిబాబు, ఆంజనేయులు, బాబు, సతీష్, బొబ్బిలి రమణారెడ్డి, మధు, ప్రవీణ్, రవీందర్, జై, రాజు, యాకూబ్, వెంకన్న, యశ్వంత్, ప్రభాకర్, జగదీష్, అంజి, బాబురావు, సాయి, రవి, రమేష్, నరేష్, వాసు, కృష్ణ, సత్యనారాయణ, కొండల్ రావు, సోమయ్య, బాబు, ఆనంద్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, కుమార్, రామచందర్, రాధిక, రాధ, మాధవి రెడ్డి, అవనీత, శైలజ తదితరులు పాల్గొన్నారు.