శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): నవంబర్ 9, 10 తేదీల్లో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో జరగబోయే 11వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సమావేశం బ్రోచర్ ను PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ప్రతినిధులు RSV బద్రీనాథ్, VV రావు, ఈశ్వరి గారి రామారావు, ఉదయ శంకర్ తదితరులు పాల్గొన్నారు.