శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతి బూత్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమంతోపాటు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, శేరిలింగంపల్లి ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్ ఆర్.బి.ఆర్ కాంప్లెక్స్, మియాపూర్ గ్రామంలో ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నాగులు గౌడ్, డివిజన్ అధ్యక్షుడు మాణిక్ రావుతో కలిసి రవికుమార్ యాదవ్ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొని భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని సూచిస్తూ ముందుకు సాగారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి బూత్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమంతోపాటు వారి సమస్యలను తెలుసుకుని నాయకులకు తెలియజేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటానని భరోసా కల్పించారు. ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆకుల లక్ష్మణ్, సురేష్, గణేష్, శ్రీనివాస్ ,రాము, విజయేందర్, డేవిడ్, సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.