గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలిలోని ఖాజాగూడ ప్రధాన రహదారిపై గురువారం ఉదయం దాబా-ఖాజాగూడ వైపు వెళ్తున్న సిమెంట్ రెడీ మిక్స్ లారీ ఆవును ఢీ కొట్టింది. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం లేవలేని స్థితిలో రోడ్డు మధ్యలో ఉన్న ఆవును క్రేన్ సహాయంతో పక్కకు తొలగింపజేశారు. ఈ సంఘటనలో అక్కడ భారీగా ట్రాఫిక్ నెలకొనగా వెంటనే ఆవును తొలగింపజేసి వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించారు. అనంతరం ఆయన ఆవుకు వైద్యం చేయించాలని లారీ డ్రైవర్‌కు సూచించారు.

