- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ వినతి
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్, ఖానామెట్, ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ బస్తీలోని శ్మశానవాటికల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ చూపుతూ నిధులను విడుదల చేయాలని, డివిజన్‌లో చేపట్టాల్సిన పెండింగ్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. మాదాపూర్ డివిజన్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడుతామన్నారు. ప్రభుత్వ విప్ గాంధీ సహాయ సహకారాలతో డివిజన్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌస్, అజీజుద్దీన్, గంగల గణేష్ యాదవ్, సార్వార్, వార్డ్ సభ్యులు రామచందర్, శ్యామ్, కృష్ణా తైలి, కృష్ణ నాయక్, లోకేష్, షైబజ్, షకీల్, ఆసిఫ్, ఇంతియాజ్, షఫిక్, ఆఫ్రోజ్, షాయల్, శ్రీనివాస్ నాయక్, అచ్యుత్ పాల్గొన్నారు.