నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో వేద పండితులు సాయి శర్మ ఆధ్వర్యంలో లలితా సహస్రనామ సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు.
కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి, ఆలయ కమిటీ నిర్వాహకురాలు గుర్రపు విజయలక్ష్మీ తో కలిసి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. 250 మంది మహిళలు కుంకుమార్చనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కట్ల చంద్ర శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేయగా రామ్మోహన్ పూజా సామాగ్రి, ఝాన్సీ లక్ష్మీ అమ్మవారికి వస్త్రాలను అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, గుర్రపు రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.