నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ ను నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ పరామర్శించారు. బిక్షపతి యాదవ్ మాతృమూర్తి మారబోయిన సందమ్మ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల ఎంపీ అరవింద్ సంతాపం వ్యక్తం చేశారు. కొండాపూర్ మసీదుబండ లోని బిక్షపతి యాదవ్ నివాసానికి వచ్చి బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ ను పలకరించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని అరవింద్ ఆకాంక్షించారు.
