శేరిలింగంపల్లి, డిసెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చిన్మయి నృత్యాలయా నాట్య గురువు శ్రీదేవి ముంగర శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. గణపతి తాళం, గురు అష్టకం, మూకాంబిక అష్టకం, అయిగిరి నందిని, చరిష్ణు, దేవా దేవం భజే అంశాలను హరిణి, తన్వి, అనూష, శ్రేష్ఠ, అభినయ, జాన్వీలు ప్రదర్శించి మెప్పించారు.






