మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని శిల్పారామం యాంఫి థియేటర్‌లో సోమవారం కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను అలరించాయి. డాక్టర్ శ్రీనివాస వర ప్రసాద్ శిష్య బృందం కృష్ణ లీలలు, భో శంభో, హనుమన్ చాలీసా, రామదాసు కీర్తన, అదిగో అల్లదిగో, పలుకే బంగారమాయెనా తదితర అంశాలను కూచిపూడి నృత్యంతో ప్రదర్శించారు. లాస్య, కృతిక, కీర్తన, సత్య, సాహిత్య, అక్షిత తదితర కళాకారులు నృత్యాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
