కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలో ప్రజలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులను అందించేందుకు కృషి చేస్తున్నామని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఎ బ్లాక్ 13వ వీధిలో రూ.25 లక్షల అంచనా వ్యయంతో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌ను అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా ఇంటి మురుగు నీటి లైన్లను ప్రధాన డ్రైనేజీకి కలుపుకోవాలని కోరారు. ఇంటి మురుగు నీటి లైన్లను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైనుకు కలుపుకొనే విధంగా ప్రజలకు సహకరించిన తరువాత రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి కార్పొరేటర్ సూచించారు. ప్రధానంగా ప్రజలు, వాహనదారులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా రోడ్ల పనులను పూర్తి చేయాలని అన్నారు. తెరాస నాయకులు సయ్యద్ ఉస్మాన్, నవాజ్ భాయ్, శివ, ఈరమ్మ, షాదిక్, జహంగీర్, గన్ని భాయ్, సయ్యద్ మఖ్బుల్, బస్తీ వాసులు ఉన్నారు.
