శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ కు వినతి – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో‌ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో ముందుంచుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ‌అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల మంజూరు చేయాలని, తదితర అంశాలపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ వినతి పత్రం అందజేశారు. ప్రగతి భవన్ లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, రాజేంద్ర నగర్ శాసన సభ్యులు టి. ప్రకాష్ గౌడ్ తో మర్యాదపూర్వకంగా మంత్రి కేటీఆర్ ను కలిశారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి వినతి పత్రం అందజేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం సంతులిత అభివృద్ధికై , చేపట్టాల్సిన భవిష్యత్ ప్రణాళికలు, పలు అభివృద్ధి పనుల కోసం నిధుల మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ ను కోరినట్లు చెప్పారు. అభివృద్ధిలో భాగంగా సివరేజ్ వ్యవస్థ, రోడ్లు, లింక్ రోడ్లు, చెరువుల సుందరీకరణ, స్మశాన వాటికల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, నెట్ వర్క్ లేని ప్రాంతాలలో నూతనంగా మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారుల నుంచి పూర్తి సమగ్ర సమాచారం సేకరించి గతంలో కంటే ఒక అడుగు ముందుకు వేసి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా  పక్కా ప్రణాళికలతో మంత్రి కేటీఆర్ కు అందజేసినట్లు ఎమ్మెల్యే గాంధీ వెల్లడించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ నిధుల మంజూరీకి, సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని చెప్పారన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here