పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి – కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాలను కాపాడుకోవాలని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ సూచించారు. వర్షా కాలంలో పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి ఆదివారం పది గంటలకు, పది నిమిషాలు అవగాహన కార్యక్రమాన్ని కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ గ్రామంలో నిర్వహించారు. ఎంటమాలజీ విభాగం అధికారులు, స్థానిక ప్రజలు, నాయకులతో కలసి కొత్తగూడలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ పర్యటించారు.

దోమల మందు పిచికారి చేయిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్

వర్షా కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. ఇంటింటికి తిరిగి స్థానిక ప్రజలకు అవగాహనా కల్పించారు. డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు ప్రభలకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండ్లలో ఉన్న డ్రమ్ములలో, పాత టైర్లలో, పరిసరాలలో ఉన్న నీటి గుంటలలో ఉన్న నీటిని కార్పొరేటర్ హమీద్ పటేల్ దగ్గరుండి తొలగించారు. పరిసరాలలో ఎంటమాలజి సిబ్బందితో దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. జీహెచ్ఎంసి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఏఈ కిరణ్ కుమార్ రెడ్డి, సూపర్ వైజర్ అబ్దుల్ సత్తార్, సిబ్బంది, సీనియర్ నాయకులు రక్తపు జంగంగౌడ్, భీమని శ్రీనివాస్, నీలం లక్ష్మి నారాయణ, కేశం కుమార్, నీలం లక్ష్మణ్, ఫయాజ్, ఇయాజ్, పుణ్యవతి, రఫియా బేగం, షేయాజ్, ప్రభాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కొత్తగూడలో ఇంటింటికి తిరిగి డ్రమ్ముల్లో నిల్వ ఉన్న నీటిని పరిశీలిస్తున్న కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here