ఈ నెల 10 న చేపట్టే తిరంగా యాత్రను జయప్రదం చేయాలి

నమస్తే శేరిలింగంపల్లి: భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న తిరంగా యాత్ర లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు పిలుపునిచ్చారు. తిరంగా యాత్ర సన్నాహక సమావేశాన్ని లింగంపల్లి లో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ మన భారత దేశం 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పూర్తిచేసుకుంటున్న శుభ సందర్భంగా దేశంలో పండగ వాతావరణం నెలకొందన్నారు. ఆగస్ట్ 10 వ తేదీ బుధవారం అసెంబ్లీ పరిధిలో జరిగే తిరంగా యాత్రను మన దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులకి నివాళిగా కుల, మత, పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని యాత్రను విజయవంతం చేసి మన భారతీయుల ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి గజ్జల యోగానంద్, రాష్ట్ర నాయకులు మువ్వా సత్య నారాయణ, రవి కుమార్ యాదవ్, ప్రభాకర్ యాదవ్, మహిపాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్, రాంరెడ్డి, ఆంజనేయులు, కమలాకర్ రెడ్డి, నవీన్ గౌడ్, వీర చారి, సత్య కుర్మా తదితరులు పాల్గొన్నారు.

తిరంగా యాత్ర సన్నాహక సమావేశంలో బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here