నమస్తే శేరిలింగంపల్లి: నల్లగండ్ల గ్రామ వాస్తవ్యులు, బీజేవైయం గచ్చిబౌలి డివిజన్ మాజీ ఉపాధ్యక్షులు అల్లం అజయ్ శంకర్ ఆకస్మిక మృతికి శేరిలింగంపల్లి నియోజకవర్గ బిజెవైఎం, బిజెపి నాయకులు సంతాపం తెలిపారు. అజయ్ శంకర్ కు కరోనా సోకడంతో గత కొన్నిరోజులుగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. అజయ్ శంకర్ మృతికి సంతాపం తెలిపిన నాయకులు ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. కుటుంబ సభ్యులకు అన్నివిధాల అండగా ఉంటామని అన్నారు.