కొండాపూర్ డివిజన్ లో పర్యటించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్, హనీఫ్ కాలనీ తదితర కాలనీలలో గల వరద ముంపు ప్రాంతాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం దాటికి హనీఫ్ కాలనీలో నాలా పక్కన గల ప్రహరీ గోడ కూలిపోవడంతో జేసీబీ సహాయంతో నాలాలో పేరుకుపోయిన మట్టి కుప్పలను, చెత్తా చెదారాన్ని తొలగింపజేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా తిరిగి పునరిద్దరించారు.

వర్షానికి కూలిన నాలా ప్రహరీ గోడ శిథిలాలను తొలగింపజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో జరుగుతున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. వరద నీటికాల్వ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే కాలనీలో మిగిలిన రోడ్లను పూర్తి చేస్తామని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగం సమన్వయంతో పని చేస్తూ తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ముంపు ప్రాంతాలు మునిగిపోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని, మాన్ సున్, ఎమర్జెన్సీ టీమ్స్ పూర్తి లస్థాయిలో సన్నద్ధమై ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ రమేష్, ఏఈ జగదీష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, ఎస్‌ఆర్ పీ రాజయ్య, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు శ్రీనివాస్ చౌదరి, తిరుపతి, రమేష్, రూప రెడ్డి, సమ్మత్, యాదగిరి, అబేద్, మంగమ్మ, సుభద్ర, నాయుడు, సంతోష్ , జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో వరద నీటి కాలువ నిర్మాణం పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here