- పాల్గొన్న ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్ట మహేష్ కుమార్ యాదవ్
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ BLY హోమ్స్ వద్ద బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ సంప్రదాయ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను కుటుంబ సభ్యులతో కలసి ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో ముఖ్య అతిథిగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడబిడ్డలంతా ఓచోట చేరి ఆట పాటలతో, కోలాటాలతో తొమ్మిది రోజుల పాటు ఆనందంగా జరుపుకొనే తెలంగాణ సంస్కృతిక ప్రతీక బతుకమ్మ అని అన్నారు. ఆడబిడ్డల ఆరాధనగా నిలిచిన బతుకమ్మ పండుగ ప్రతి ఇంటికి ఆనందం, సుభిక్షం, శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






