శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటూ, భారాస అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఒడిశా రాష్ట్రం పూరీ తీరాన సైకతం శిల్పంను ఏర్పాటు చేశారు. భారాస అధినేత కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శేరిలింగంపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, భారాస సీనియర్ నేత చిర్రా రవీందర్ యాదవ్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించారు. ఈ సైకత శిల్పంలో హీ డిమాండ్, వీ బిలీవుడ్, తెలంగాణ వాస్ బార్న్ ఏ ప్రామిస్ ఫుల్ ఫిల్డ్ అనే నినాదాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత, జన హృదయ నేత, కారణజన్ముడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అంటూ రాశారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని సందేశం ఇచ్చేలా సైకత శిల్పంలో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తితో తెలంగాణ రక్షణ కోసం మరో ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా రూపొందించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి యువ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణను సాధించి, అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. ముమ్మాటికి తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని, ఆయురారోగ్యాలతో కేసీఆర్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలను చిర్రా రవీందర్ యాదవ్ వెల్లడించారు. పూరీ తీరాన పర్యాటకలను కేసీఆర్ సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. టూరిస్ట్ లు సైకతం శిల్పం వద్ద ఫోటోలు దిగుతూ కేసీఆర్ కి జన్మదిన వేడుకలను తెలిపారు.






