శేరిలింగంపల్లి, మార్చి 2 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 14వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్, పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, సెంట్రల్ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డి చైర్ పర్సన్, ప్రొఫెసర్ అలేఖ్య పంజాల, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
అనంతరం సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ మంగళరాపు లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులను ఎటువంటి ఒత్తిడికి గురి చెయ్యకుండా వారికి అర్ధం అయ్యేట్టుగా విద్య భోధన చేయాలన్నారు. విద్యాబోధనలో తమ స్కూల్స్ నూతన ఒరవడిని సృష్టిస్తున్నాయని అన్నారు. అతి తక్కువ ఫీజులతో, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిచటం అంటే కత్తి మీద సామేనని అన్నారు. కానీ తమ విద్యా విధానంలోను, స్కూల్ ఫీజుల విషయంలోనూ తమకు తామే సాటి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పేరుక రమేష్ పటేల్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రాజు యాదవ్, శ్రీనివాస్ చౌదరి, మంగళరాపు తిరుపతి, బుడుగు తిరుపతి రెడ్డి, చింతల రాజు యాదవ్, పలువురు ప్రముఖులు, దాదాపుగా 15 వందల మంది విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.