కార్తీక మాసం ప్ర‌త్యేక పూజ‌లు ప్రారంభం

  • మొద‌టి సోమ‌వారం దేవాల‌యాల్లో భ‌క్తుల సంద‌డి
కార్తీక సోమ‌వారం నాడు భ‌క్తుల‌కు క‌నువిందు చేస్తున్న తారాన‌గ‌ర్ తుల్జా భ‌వానీ మాత‌

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కార్తీక మాసం ప్రారంభ‌మైన నేప‌థ్యంలో శేరిలింగంప‌ల్లిలోని ప్ర‌ధాన ఆల‌యాల్లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. మొద‌టి రోజే సోమ‌వారం అవ్వ‌డంతో ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. విశాఖ శ్రీ శార‌ద పీఠ‌ం ప‌రిధిలోని చందాన‌గ‌ర్ వెంక‌టేశ్వ‌రాల‌యం, శిల్పా ఎన్‌క్లేవ్‌లోని శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం, అన్న‌పూర్ణ ఎన్‌క్లేవ్‌లోని అన్న‌పూర్ణ స‌మేత కాశీ విశ్వేష్వ‌రాల‌యాలం అదేవిధంగా దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ ప‌రిధిలోని తారాన‌గ‌ర్‌ శ్రీ తుల్జా భ‌వానీ ఆల‌యంలో శివుడికి అర్చ‌న‌లు అభిషేకాలు నిర్వ‌హించారు. అదేవిధంగా సాయం సంధ్య వేళ ముక్కోటి దేవ‌త‌ల‌ను ఆరాధిస్తూ ఆకాశ దీపాల‌ను వెలింగించారు. ప‌రిస‌ర ప్రాంతాల భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో దేవాల‌యాల‌కు విచ్చేసి ప్ర‌త్యేక పూజ‌లు ఆచ‌రించారు.

శిల్పా ఎన్‌క్లేవ్ శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో పూజ‌లందుకుంటున్న శివ‌లింగం
చందాన‌గ‌ర్ వెంక‌టేశ్వ‌రాల‌య స‌ముదాయంలో ఆకాశ దీపం వెలిగిస్తున్న అర్చ‌కులు
అన్న‌పూర్ణ ఎన్‌క్లేవ్ విశ్వేష్వ‌రాల‌యంలో ఆకాశ దీపం వెలిగిస్తున్న‌ పురోహితులు, భౌతికదూరం పాటిస్తూ ద‌ర్శించుకుంటున్న భ‌క్తులు
తారాన‌గ‌ర్ న‌గ‌ర్ తుల్జాభ‌వానీ ఆల‌యంలో ఆక‌ట్టుకుంటున్న దీపాల వ‌ర‌స‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here