శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృ శ్రీ నగర్ కాలనీలో ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, మహిళలతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , కావూరి అనిల్ కుమార్, వాసు , మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






