శేరిలింగంపల్లి, జనవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నాట్య గురువు చంద్ర శేఖర్ శిష్య బృందం, కుమారి ప్రణవి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. తాండవ నృత్య కారి, బ్రహ్మాంజలి, సరస్వతి కీర్తన, విన్నపాలు, అన్నమాచార్య కీర్తనలు, భామాకలాపం, కొలువైతి వరంగా సాయి అంశాలను అమూల్య, స్నిగ్ధ, సురభి, మహాలక్ష్మి, వాసుకి, అక్షర, రిత్విక్, వాసుకి, వసుధ, మొదలైనవారు ప్రదర్శించి మెప్పించారు. ప్రణవి తుమ్మాటి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో మూషిక వాహన, శ్రీ విజ్ఞారాజం భజే,మీనాక్షి పంచరత్న, గరుడ గమన, ముద్దుగారే యశోద, ఇదిగో భద్రాద్రి, కుండా పై నృత్యం అంశాలను శ్రీ విద్య, సహస్ర, అర్షి, సమన్విత, నక్షత్ర, శాన్వి రితిక మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
