నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుదవారం కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం లోకి వివిధ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు స్థానిక కార్పొరేటర్లు మంజుల రఘునాథ్‌రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, గంగాధర్‌రెడ్డి, నార్నే శ్రీనివాస్‌రావులతో కలసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో లోను ఆడపడుచులు అవస్థలు పడకుండా కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ అవకాశాన్ని అర్హులైన ఆడపడుచులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలోని లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, మాదాపూర్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.