శేరిలింగంపల్లి, ఏప్రిల్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పటేల్ కుంట పార్క్ ఎదురుగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఒక గొప్ప సామాజిక విప్లవకారుడని అన్నారు. అప్పట్లోనే భారతదేశంలో సామాజిక సమానత్వం కోసం పునాది వేసిన మహానీయుడని, విద్య లేకపోతే సరైన జ్ఞానం, విజ్ఞానం ఉండదు అని నమ్మిన ఏకైక వ్యక్తి పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామరాజు, కేశవులు, నర్సింగ్ యాదవ్, మణి భూషణ్, నరసింహ చారి, కృష్ణంరాజు, సందీప్ గౌడ్, కమలాకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, బాలు యాదవ్ , గోపాల్ రావు , ఆంజనేయులు యాదవ్ , నర్సింగ్ రావు, రాయల్ రఘు, సురేష్, విష్ణువర్ధన్ రెడ్డి, చాంద్ , రాజు, సాయి, వేణు , దినేష్, కళ్యాణ్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.






