హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): డిసెంబర్ 2020 వరకు కాల పరిమితి ముగిసిన బస్‌పాస్‌లను జర్నలిస్టులు రెన్యువల్ చేయించుకోవాలని టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అనంతరం సెప్టెంబర్ 26వ తేదీ నుంచి 15 బస్ పాస్ కేంద్రాలను ఆపరేట్ చేస్తున్నామని, తరువాత వాటి సంఖ్యను 33కు పెంచామని అన్నారు. ఈ క్రమంలోనే బస్ పాస్ కేంద్రాల సమయ వేళలను పెంచామని, ఉదయం 7.30 నుంచి రాత్రి 8.15 గంటల వరకు కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. ఇక డిసెంబర్ 31, 2020 తేదీలో గడువు ముగిసిన పాస్‌లకు గాను జర్నలిస్టులు రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. జర్నలిస్టుల సంఘాల వినతిమేరకు వారి బస్ పాస్‌లను రెన్యువల్ చేస్తున్నట్లు తెలిపారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో జనవరి 18 నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని, అందులో జర్నలిస్టులు తమ బస్ పాస్‌లను రెన్యువల్ చేసుకోవచ్చని సూచించారు. దీంతోపాటు నగరంలోని 33 కేంద్రాల్లోనూ జర్నలిస్టులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని అన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జర్నలిస్టుల పాస్‌లను రెన్యువల్ చేస్తారని తెలిపారు.