నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని శేరిలింగంపల్లి డివిజన్ లో ని రైల్వే బ్రిడ్జి వద్ద గల జయశంకర్ సార్ విగ్రహానికి శుక్రవారం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కాని, ఉద్యమ భావజాలం వ్యాప్తి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు జయశంకర్ సార్ అని అన్నారు. ఉద్యమ సమయంలో నాయకులకు మార్గనిర్దేశం చేసి ప్రజల్లో చైతన్య బీజంవేసిన తెలంగాణ సిద్ధాంతకర్త అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున శర్మ, శ్రీనివాస్ చారి, గోవింద్ చారి, సాయన్న , మాణిక్యాచారి, సుధాకర్ చారి, కొండల్ రెడ్డి, యాదాగౌడ్,దేవులపల్లి శ్రీనివాస్, జనార్దన్ గౌడ్, కలివేముల వీరేశం గౌడ్, వార్డ్ మెంబెర్లు కవిత, శ్రీకళ తో పాటు సత్యనారాయణ, నటరాజ్, భాగ్య, రోజా, ఘనపురం రవీందర్, సుధాకర్ రెడ్డి, గోపినగర్ బస్తి కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, బి.రమేష్, రవి యాదవ్, శ్రీకాంత్ యాదవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, దేవులపల్లి శ్రీకాంత్, దినేష్, నరసింహ, పట్లోళ్ల నరసింహా రెడ్డి, రాజ్ కుమార్, దేవులపల్లి ప్రణయ్, పెరుగు సందీప్, చింటూ తదితరులు పాల్గొన్నారు.