నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ అంగన్‌వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు సౌజన్యంతో అంగన్‌వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి పాలు పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. ఆగస్టు 1 నుంచి 8 వరకు తల్లి పాల వారోత్సవాలను జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వ్యక్తిగత పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని, అదేవిధంగా పరిసరాలను ఎల్లపుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ లక్ష్మి భాయ్, చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సూపర్ వైజర్ జ్యోతి, సీనియర్ నాయకులు వెంకటేష్, ఈశ్వర, అరుణ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, జై శ్రీనివాస్, పీ రాజు అంగన్ వాడి టీచర్లు జ్యోతి, స్వప్న, సునీత, నాగమణి, కవిత, శ్రీలత, గాయిత్రీ, శివలత, శారద, శాంతాబాయి, రాధిక, మౌనిక, భాగ్య, జ్యోతి, షాహీన్, పార్వతీ, పరిమల, మమత, రాణి, రూపారాణి, నస్రీన్, సంధ్య, వినోద, కె.లక్ష్మి, లక్ష్మి, నిర్మల, శైలజ, హెల్పెర్స్ లక్ష్మి, లావణ్య, యాదమ్మ, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.