నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని జీపీఆర్ఏ క్వార్టర్స్ నివాసి జాతీయ స్విమ్మర్ శశాంక్ యాదవ్ బెంగుళూర్ లో నిర్వహంచే ప్రత్యేక స్విమ్మింగ్ శిక్షణ లో పాల్గొడానికి హోప్ ఫౌండేషన్ చేయత అందించింది. శిక్షణలో పాల్గొనడానికి కావాల్సిన ఖర్చు రూ.11,500 ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే గాంధీ చేతుల మీదుగా ఫౌండేషన్ చైర్మైన్ కొండ విజయ్ శుక్రవారం శశాంక్‌కు అందచేసారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ జాతీయ స్విమ్మింగ్ లో రాణిస్తున్న శశాంక్ మరింత ఎదగాలని, ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు అందచేస్తామని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు హాప్ ఫౌండేషన్ ముందుకు రావడం పట్ల కొండ విజయ్‌ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.