నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ లో జార్ఖండ్ ఎక్తా సమాజ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరండి, కేంద్ర సహాయ విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి, బిజెవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్ పాల్గొని హైదరాబాద్ లో నివసిస్తున్న జార్ఖండ్ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనా సమయంలో జార్ఖండ్ వాసులకు సహాయం అందజేసి అండగా నిలిచిన రఘునాథ్ యాదవ్ ను అభినందించారు.బిజెపిలో యువతకు సముచిత స్థానం కలుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని సేవలందించి రాజకీయంగా వృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.