నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ను భువనేశ్వర్ పార్లమెంట్ సభ్యురాలు అపరాజిత సారంగీ పరామర్శించారు. గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ను మియాపూర్ ఆల్విన్ కాలనీలోని తన నివాసంలో భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఒరిస్సా కుటుంబ సభ్యులకు నిత్యావసర వస్తువులను అందజేసి అండగా నిలిచిన జ్ఞానేంద్ర ప్రసాద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వీలైనంత త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని పార్టీ కార్యక్రమాలలో మరింత ఉత్సాహంగా పాల్గొనాలని ఎంపీ అపరాజిత సారంగి ఆకాంక్షించారు. ఆమెతో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు.