జ‌న‌ప్రియ ఫేజ్‌1లో నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌ను ప‌రిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్ ప‌రిధిలోని ఖాయిద‌మ్మ‌కుంట‌ చెరువు నుండి సితార హోటల్ వరకు రూ.8.00 కోట్లతో చేప‌డుతున్న నాల విస్త‌ర‌ణ ప‌నుల‌ను జనప్రియ ఫేజ్‌1 వద్ద‌ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, మాదాపూర్ కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌లు బుద‌వారం సంద‌ర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కరోనా వంటి విపతర్క పరిస్ధితుల్లో అభివృద్ధి, సంక్షేమం అగకూడదనే ఉదేశ్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తున్నామని, అదేవిధంగా వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాల దృష్ట్యా నాలా విస్తరణ, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారుల‌కు సూచించారు. నాల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని రాజీ పడితే స‌హించేద‌దిలేద‌న్నారు. పనులలో వేగం పెంచాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతలు, నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సన్నద్ధం కావాలని, ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంపుకు గురికాకండా ముందస్తుగా తగు చర్యలు అధికారుల‌కు తెలిపారు. ప్రాజెక్ట్, స్థానిక బ‌ల్దియా ఇంజ‌నీరింగ్‌ అధికారులు సమన్వయంతో పని చేసి పనులలో పురోగతి సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు బాలింగ్‌ గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు శాంతయ్య, ప్రవీణ్, శ్రీనివాస్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌, బాలింగ్ గౌత‌మ్ గౌడ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here