చందాన‌గ‌ర్‌లో రూ.2.15 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు గాంధీ శంకుస్థాప‌న‌… హ‌ర్షం వ్య‌క్తం చేసిన కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని సాయి మారుతి ఎనక్లేవ్, శంకర్ నగర్ ఫేస్-2, రెడ్డి కాలనీ, దీప్తి శ్రీ నగర్, CBR ఎస్టేట్ కాలనీలలో రూ.2 .15 కోట్ల‌ అంచనా వ్యయంతో చేబట్టబోయే అభివృద్ధి ప‌నుల‌కు స్థానిక‌ కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్‌ల‌తో కలిసి ప్ర‌భుత్వ విప్ గాంధీ శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ స్థానిక కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి అభ్య‌ర్థ‌న మేర‌కు చందాన‌గ‌ర్ డివిజ‌న్‌లో ఒకే రోజు రూ.2 కోట్ల‌కు పైగా నిధుల అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసుకోవ‌డం జ‌రిగింద‌ని అన్నారు. డివిజ‌న్‌లోని ప్ర‌తి కాల‌నీలో మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కృషి చేస్తామ‌ని అన్నారు. కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ సాయి మారుతి ఎనక్లేవ్, శంకర్ నగర్ ఫేస్-2, కానీలలో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు, సీబీఆర్‌ ఎస్టేట్‌లో రూ.67 లక్షలతో బాక్స్ డ్రైన్, దీప్తి శ్రీ నగర్ కాలనీలో రూ.38 లక్షలతో వరద నీటి కాల్వ పై స్లాబ్, రెడ్డికాలనీతో పాటు ఇతర ప్రాంతాల్లో రూ.70.00 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే పార్కుల‌ సుందరికరణ పనుల‌కు శ్రీకారం చుట్ట‌డం సంతోష‌క‌రమ‌ని, అందుకు స‌హ‌క‌రించిన గాంధీకి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఈ రూప దేవి, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్, శ్రీధర్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీ నారాయణ గౌడ్, నాయకులు దాసరి గోపి, వెంకటేష్, జనార్దన్ రెడ్డి, కరుణాకర్ గౌడ్, రవీందర్ రెడ్డి, గుడ్ల ధనలక్ష్మి, అక్బర్ ఖాన్, ప్రీతమ్, దాస్, పూర్ణచందర్ రావు, సీతారామయ్య నారాయణ, రాజు, వెంకట్,కొండల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, యశ్వంత్, ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, వెంకటేష్, మధు, వరలక్ష్మి, భవాని తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్లు మంజుల ర‌ఘునాథ్ రెడ్డి, ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here