శేరిలింగంప‌ల్లిలో డాక్ట‌ర్ శ్యామ్ ప్ర‌సాద్ ముఖ‌ర్జీకి ఘ‌న నివాళి

వాడ‌వాడ‌లా నివాళుల‌ర్పించిన బిజెపి నాయ‌కులు
న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: జ‌నసంఘ్ వ్య‌వ‌స్థాప‌కులు జాతీయ భావ సిద్ధాంత రూపకర్త డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ను పుర‌స్క‌రించుకుని శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో బిజెపి నాయ‌కులు ఆయ‌నకు ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా దేశానికి ఆయ‌న చేసిన సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు.

దేశభక్తికి నిలువుటద్దంగా నిలిచిన స్ఫూర్తిప్రదాత శ్యామ్ ప్ర‌సాద్ ముఖ‌ర్జీ : జ్ఞానేంద్ర ప్రసాద్
హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్ ప‌రిధిలోని ఆల్విన్ కాల‌నీ చౌర‌స్తాలోగ‌ల బిజెపి కార్యాల‌యంలో డివిజ‌న్ అధ్య‌క్షులు శ్రీ‌ధ‌ర్‌రావు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ వ‌ర్ధంతి కార్య‌క్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ హ‌జ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ చిత్ర‌ప‌టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత‌రం జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అఖండ భారతదేశ స్ఫూర్తిని గుండెగుండెలోనూ రగిలించిన జాతీయవాది, నిరాండబరతకు నిదర్శనంగా నిలిచిన జననేత, దేశభక్తికి నిలువుటద్దంగా నిలిచిన స్ఫూర్తిప్రదాత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. భారత దేశంలో సంపూర్ణంగా విలీనమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఉద్యమం ప్రారంభించార‌ని కాశ్మీర్ కోసం ప్రాణాల‌నే త్య‌జించిన‌ మహానీయుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి, బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జితేందర్, నాయకులు కోటేశ్వరరావు, బాబురెడ్డి,నవీన్,నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పిస్తున్న జ్ఞానేంద్ర‌ప్ర‌సాద్ త‌దిత‌రులు

గ‌చ్చిబౌలి డివిజ‌న్‌లో…
బిజెపి గ‌చ్చిబౌలి డివిజ‌న్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన బ‌లిదాన్ దివ‌స్ కార్య‌క్ర‌మానికి పార్టీ రాష్ట్ర నాయ‌కులు ర‌వికుమార్‌యాద‌వ్‌, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి లు హాజ‌రై డాక్ట‌ర్ శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఒకే ప్రధాని ఉండాలి” అని నెహ్రూ తీసుకువచ్చిన 370 ఆర్టికల్ ని వ్యతిరేకించిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. కులమతాలకు అతీతంగా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరి పై ఉంద‌ని చాటిన శ్యాంప్రసాద్ ముఖర్జీ అడుగుజాడ‌ల్లో నేటి యువ‌త న‌డ‌వాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు విఠల్ , శ్రీరాములు, రమేష్, సుబ్రమణ్యం, విజయ్, శ్రీశైలం, నర్సింగ్, శ్రీకాంత్, ప్రశాంత్, క్రాంతి, వెంకటేష్, విష్ణు, వెంకటేష్, జీవ, తదితరులు పాల్గొన్నారు.

శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పిస్తున్న ర‌వికుమార్‌యాద‌వ్‌, గంగాధ‌ర‌రెడ్డి త‌దిత‌రులు

గౌలిదొడ్డిలో…
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లో డివిజన్ నాయ‌కుల‌ ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్నిబుధ‌వారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి శ్యామ్‌ప్ర‌సాద్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంత‌రం గంగాధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ అఖండ భారతదేశ స్ఫూర్తిని గుండెగుండెలోనూ రగిలించిన జాతీయవాది, నిరాండబరతకు నిదర్శనంగా నిలిచిన జననేత, దేశభక్తికి నిలువుటద్దంగా నిలిచిన స్ఫూర్తిప్రదాత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, జిల్లా కోశాధికారి రమేష్ సోమిశెట్టి, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చారి, సీనియర్ నాయకులు ఆర్ వెంకటేష్ , విఠల్, శ్రీరాములు, శంకర్ యాదవ్, కిషన్ సింగ్, రమేష్, రంగస్వామి, సుబ్రమణ్యం, విజయ్, శ్రీశైలం, శ్రీనివాస్, సంజీవ, శ్యామ్లెట్ రాజు, రాములు, ప్రసాద్, రాజు, రాఘవేంద్ర , నర్సింహా గౌడ్, శివ గౌడ్, నర్సింగ్ రావు, శ్రీకాంత్, ప్రశాంత్, క్రాంతి, వెంకటేష్, విష్ణు, వెంకటేష్, జీవ, తదితరులు పాల్గొన్నారు

శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పిస్తున్న కార్పొరేట‌ర్‌ గంగాధ‌ర‌రెడ్డి త‌దిత‌రులు

శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీకి భాస్క‌ర‌రెడ్డి నివాళి..
జనసంఘ్ వ్యవస్థాపకులు, జాతీయ భావ సిద్ధాంత రూపకర్త డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ‘బలిదాన్ దివస్’ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయ‌కులు క‌సిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి చందానగర్ లోని తన కార్యాలయంలో శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో న్యాయవాది వెంకటరమణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పిస్తున్న క‌సిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి త‌దిత‌రులు

చందాన‌గ‌ర్ డివిజ‌న్‌లో…
డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సంద‌ర్భంగా చందాన‌గ‌ర్ డివిజ‌న్ అధ్య‌క్షులు రాంరెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్ కంటెస్టెడ్ అభ్య‌ర్థి క‌సిరెడ్డి సింధుర‌ఘునాథ్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు శోభ దూభే, శివకుమార్ వర్మ, శ్రీనివాస్ ముదిరాజ్. లలిత, రాకేష్ దుబై, అమరేందర్ సింగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పిస్తున్న క‌సిరెడ్డి సింధుర‌ఘునాథ్‌రెడ్డి త‌దిత‌రులు

కొండాపూర్ డివిజ‌న్‌లో…
కొండాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని అంజ‌య్య‌న‌గ‌ర్‌లో డివిజ‌న్ అధ్య‌క్షులు యం.ఆంజ‌నేయులు సాగ‌ర్ ఆధ్వ‌ర్యంలో బ‌లిదాన్ దివస్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి, పార్టీ కార్పొరేట‌ర్ కంటెస్టెడ్ అభ్య‌ర్థి యం. రఘునాథ్ యాదవ్ శ్యామ్‌ప్ర‌సాద్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం జనసంఘ్ పార్టీని స్థాపించి ఏక్ దేశమే దో విధాన్, దో ప్రదాన్ , ధోనిషాన్, న‌హీ ఛ‌లెంగే అని నినదించి ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన వీరుడు శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ అని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ సీనియర్ నాయకులు సాయి కృష్ణ ప్రసాద్, మన్యంకొండ సాగర్ , ఆత్మారామ్, మేరీ, వినీత సింగ్, నవీన్ రెడ్డి, శ్రీదేవి ,సంతోషి , సంతోష్ కుమార్ ,ఓం ప్రకాష్, జి నరసింహ, జి రవీందర్ సాగర్, కృష్ణ, సాయి , ఆలకుంట నరసింహ , జోగులు , గిరి, అచ్యుత్ రెడ్డి , సాయికుమార్ పటేల్, నారా సాయి, సాగర్ నాయక్ , శ్రీకాంత్, చెన్నయ్య , చిన్న సాగర్, ప్రసాద్ రెడ్డి తదిత‌రులు పాల్గొన్నారు.

శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పిస్తున్న కొండాపూర్ డివిజ‌న్ నాయ‌కులు

వివేకానంద‌న‌గ‌ర్ డివిజ‌న్‌లో…
శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ బిజెపి పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ రావు ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు రామరాజు, మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా మహిళా సెక్రెటరీ విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ దేశం లో ” ఒక జెండా ఒక ప్రధాని ఒక రాజ్యాంగం ” అనే నినాదాన్ని తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ అని, 370 ఆర్టికల్ ని వ్యతిరేకించి తన ప్రాణాలను సైతం వదిలారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్యవర్గ సన‌భ్యులు నామన శ్రీనివాస్, కూకట్పల్లి డివిజన్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, డివిజన్ మాజీ అధ్యక్షులు శ్రీ హరి యాదవ్, డివిజన్ జనరల్ సెక్రటరీ రాజు, దయాకర్ రెడ్డి, గణేష్ గౌడ్, జితేందర్, డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు లలిత, మమత సుతి, తదితరులు పాల్గొన్నారు.

బ‌లిదాన్ దివ‌స్ సంద‌ర్భంగా మొక్క‌లు నాటుతున్న వివేకానంద‌న‌గ‌ర్ బిజెపి నాయ‌కులు

మియాపూర్ డివిజ‌న్‌లో…
మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని జ‌న‌ప్రియ అపార్ట్‌మెంట్‌లో బిజెపి నాయ‌కులు నిర్వ‌హించిన శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర నాయకులు మనోహర్, జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షుడు వరప్రసాద్, ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి రవి గౌడ్, డివిజన్ ఓబిసి అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, డివిజన్ ఉపాధ్యక్షులు యాదగిరి, లక్ష్మారెడ్డి, జానీ, సాయి, రణధీర్, రామారావు, గోపి తదితరులు పాల్గొన్నారు

శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పిస్తున్న మియాపూర్‌ డివిజ‌న్ నాయ‌కులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here